చౌటుప్పల్‌లోని దివిస్ కంపెనీ వద్ద ఆటో యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో ముందున్న కారును ఢీకొనడంతో కారు కూడా దెబ్బతింది. లింగోజిగూడెనికి చెందిన ఆటో డ్రైవర్ పోలేపల్లి అంజయ్య (56)కు గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.