సూర్యాపేట–ఏపూరు రహదారిపై ఆత్మకూరు ఎస్ క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తుమ్మలపెన్పహాడ్ నుండి సూర్యాపేట వైపు వస్తున్న తండ్రీకొడుకులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కొడుకు సైదులు అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి పంతులుకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.