సూర్యాపేట మున్సిపాలిటీ 23వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వార్డ్ ఇంచార్జి వల్దాస్ స్పందన కిరణ్, వార్డ్ అధ్యక్షుడు ఏర్పుల కిరీటి, మాజీ కౌన్సిలర్ కళ్లేపెళ్లి మహేశ్వరి జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. స్పందన కిరణ్ మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం విజయవంతమై, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో ప్రజలకు మేలు జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.