బక్రీద్ పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి రాష్ట్ర ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, భక్తికి ప్రతీక అయిన బక్రీద్‌ను ఐక్యతతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రార్థనలు ఫలించాలని కోరుకున్నారు. తెలంగాణలో కుల, మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, ఆయన హయాంలో అన్ని మతాల పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యత లభించిందని పేర్కొన్నారు. గత పదమూడు ఏళ్లుగా తెలంగాణలో అన్ని పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు. గంగా-జమున తహజీబ్ సంస్కృతిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.