సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో మిర్యాలగూడ రోడ్డులోని పాడుబడ్డ చాణక్య రైస్ మిల్లులో గుర్తు తెలియని వ్యక్తి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహం వద్ద లభించిన మొబైల్ ఫోన్ ద్వారా మృతుడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ లాక్ అయి ఉండటంతో పాటు, వచ్చిన మెసేజ్‌లు హిందీలో ఉండటంతో అతను ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని మిల్లుల్లో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికుల్లో ఒకరై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.