కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండారు మంగమ్మకు మద్దత్తుగా ప్రచారం

సూర్యాపేటలోని 9వ వార్డులో బలహీన వర్గాల కాలనిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండారు మంగమ్మ వెంకన్నకు మద్దతుగా గురువారం ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్