సూర్యాపేటలో యువ నాయకుడు చలసాని రాజీవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సూర్యాపేట సన్సిటీ కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పెన్నులు, పుస్తకాలు అందజేయడంతో పాటు భోజనం ఏర్పాటు చేశారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించి యువతలో సేవా స్ఫూర్తిని చాటారు. ఈ కార్యక్రమంలో నజీమ్, రాహుల్, సాయి, శ్రీకాంత్, బాచి, అఖిల్, భార్గవ్, సుల్తాన్, వంశీ, కార్తీక్, చిన్ను తదితరులు పాల్గొన్నారు.