దీర్ఘకాలికంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాస్ రావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎంజి రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టి, కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో చేసి, భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు రాసిన వినతి పత్రాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు అందించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు మొండి వైఖరి అవలంబిస్తున్నాయని ఆయన ఆరోపించారు.