లక్కీ డ్రాలో సీఎం రేవంత్‌రెడ్డి పేరు

సూర్యాపేటలో శుక్రవారం రాత్రి 26వార్డు రెడ్డి హాస్టల్ దగ్గర కాసం మణి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రాలో సీఎం రేవంత్‌రెడ్డి పేరుతో రాసిన చీటీ విజేతగా ఎంపికైంది. దీంతో చీటీ రాసిన తోనుకునూరు సాయికుమార్‌కు రూ. 25 వేల నగదు, 15 కిలోల లడ్డు బహుమతిగా లభించాయి. అయితే రూ. 25 వేల నగదును కమిటీకి తిరిగి అందించి, లడ్డును మాత్రమే స్వీకరించారు. సీఎం పేరుతో ఉన్న చీటీ విజేతగా రావడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సంబంధిత పోస్ట్

✕
✕