కోదాడలో తెర సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో సహజనటుడు, హాస్య నటుడు వేణుమాధవ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ చిత్రపటానికి కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారు పార సీతయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే తన హావభావాలు, అనుకరణతో నవ్వించిన వేణుమాధవ్ సినీ రంగంలోకి ప్రవేశించి 400కు పైగా చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారన్నారు. నటుడిగా, మిమిక్రీ కళాకారుడిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా రాణించారని తెలిపారు. కార్యక్రమంలో షేక్ మీరా, పోలిశెట్టి బ్రహ్మం, బూర సైదారావు, షేక్ పీర్ సాహెబ్ ఉన్నారు.