సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష ధోరణి, సర్ ప్రక్రియలో జరిగిన అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సోమవారం దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు, పీసీసీ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది పాల్గొన్నారు. SIR ప్రక్రియలో ఓటర్ల హక్కులకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని నాయకులు తెలిపారు.