ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి

సూర్యాపేట మున్సిపాలిటీ 1వ వార్డు కుడకుడలో జరిగిన ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక గ్రామసభలో జిల్లా ఎస్పీ నరసింహ పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అవసరమని, వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలని, మహిళల భద్రత, రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్