జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యురాలుగా ధరావత్ మమత రవి నాయక్

సూర్యాపేట మున్సిపాలిటీకి చెందిన ధరావత్ రవి నాయక్ సతీమణి మమత, సూర్యాపేట బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, రాష్ట్ర నాయకులు తుక్కని మన్మధ రెడ్డికి మమత ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి అండగా ఉంటానని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్