అంగన్‌వాడీ కేంద్రానికి గ్లాసులు, ప్లేట్ల పంపిణీ

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డు యువ నాయకుడు చెంచాల నిఖిల్ నాయుడు, చిన్నారుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఆదేశాల మేరకు 20వ వార్డు అంగన్‌వాడీ కేంద్రానికి కోనేటి చిన్ని గ్లాసులు, ప్లేట్లను పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సామాజిక సేవాభావంతో ముందుకు రావాలని, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ భరణి రెడ్డి, ఏఎన్ఎం ఉమా, ఆయా ఉప్పమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్