గులాబీ పువ్వులు ఇచ్చి రోడ్డు భద్రత తెలిపిన జిల్లా ఎస్పీ

హైదరాబాద్ నుండి ఆంధ్రప్రాంతానికి సంక్రాంతి పండుగకు వెళుతున్న వాహనదారులకు సూర్యాపేట పట్టణం శివార్లలో జిల్లా ఎస్పీ గులాబీ పుష్పాలు అందజేసి రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రమాదాలకు గురికాకుండా, పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సూచించారు. ఎస్పీ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్