సులభమైన పిన్ నంబర్లు ప్రమాదకరం..ఎస్పీ

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా బస్టాండ్లు, మార్కెట్లలో మొబైల్ దొంగతనాలు, డిజిటల్ మోసాలు పెరుగుతున్నాయని, ప్రజలు తమ వ్యక్తిగత, ఆర్థిక సమాచార భద్రతపై శ్రద్ధ వహించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సులభమైన పిన్ నంబర్లు, పుట్టిన తేదీలు, మొబైల్ నంబర్లు వంటివి వాడటం ప్రమాదకరమని, వాటిని మార్చుకోవాలని ఆయన సూచించారు. ఈ సూచనలు సూర్యాపేట, హుజూర్ నగర్ నియోజకవర్గాలకు వర్తిస్తాయి.

సంబంధిత పోస్ట్