ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి.. రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట డిపోలో తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ కార్మికులను కలిసి వారి సమస్యలు, ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు, ఆరోగ్య భద్రత, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. గుర్తింపు యూనియన్ ద్వారా కార్మికుల హక్కుల పరిరక్షణకు బలమైన గళం వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕