వైద్య సహాయం అందించేందుకు కృషి

సూర్యాపేట మండలంలోని కెటి అన్నారం గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నాగుల మీరాను ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అవసరమైన వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, సర్పంచ్ కురెళ్ళి శరభచారి, కొండపల్లి దిలీప్ రెడ్డి, తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, అభినయ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్