సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖనాపురం గ్రామంలో మంగళవారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్నరామకోటమ్మ (75) అనే వృద్ధురాలిని వెనుకకు వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు.