సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండ మీది చందుపట్ల గ్రామంలో బుధవారం వెంకటేశ్వర స్వామి దేవాలయ ఉత్సవాల అనంతరం, పాత పాలకవర్గం కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. పొనుగోటి శ్రీధర్ రావు ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తన సేవలకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని, స్వామివారి భూములకు సంబంధించిన కౌలు డబ్బులు సకాలంలో చెల్లించాలని, కౌలు రైతులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోడి వీరాస్వామి వైస్ చైర్మన్‌గా, బొడుపుల హరికృష్ణ ప్రధాన కార్యదర్శిగా, పిల్లి శ్రీనివాస్ కార్యదర్శిగా, శివరాత్రి క్రిష్ణ కోశాధికారిగా ఎన్నికయ్యారు.