సూర్యాపేటలో ఆక్రమణల కలకలం: ప్రమాదకరంగా మారిన వాణిజ్య బోర్డులు

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఫైర్ స్టేషన్ పక్కన నిబంధనలను అతిక్రమిస్తూ రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి అనధికారికంగా వాణిజ్య బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా స్పీడ్ బ్రేకర్ వద్దే మిల్క్ సెంటర్ బోర్డు ఉండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలుపులు, స్పీడ్ బ్రేకర్ల వద్ద ఇలాంటి బోర్డుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని బుధవారం స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆక్రమణల వల్ల ప్రజా రవాణాకు ఆటంకం ఏర్పడుతోందని పేర్కొంటూ, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕