సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీనిని అరికట్టాలని కోరుతూ బీజేపీ కోదాడ మండల అధ్యక్షుడు గాదరి పుల్లారావు ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి సలీమ్ షరీఫ్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు భూమా శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు బ్రహ్మానంద రెడ్డి, నాగరాజు, గోపి పాల్గొన్నారు.