కోదాడ నియోజకవర్గంలోని ఊర్లుగొండ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. సర్వారం ఫీడర్ ద్వారా వ్యవసాయానికి సరఫరా చేయాల్సిన విద్యుత్‌ను సరైన సమయానికి, నాణ్యతతో అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వరి పంటలు కీలక దశలో ఉండగా, సాగునీటి కోసం విద్యుత్‌పై ఆధారపడాల్సి వస్తోందని, అయితే విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు, తక్కువ వోల్టేజ్, నిర్ణీత సమయాల్లో కరెంట్ అందకపోవడం వల్ల బోర్లు సరిగా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.