మాజీ కౌన్సిలర్ చెంచల శ్రీనివాస్ మృతి

సూర్యాపేట పట్టణంలోని 20వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చెంచల మణిలత భర్త, పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కౌన్సిలర్ చెంచల శ్రీనివాస్ మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చెంచల శ్రీనివాస్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్

✕
✕