ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో లక్షల రూపాయలు మోసం చేస్తున్న 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు, తెల్లబల్లి, పాలారం, లక్ష్మీపురం, వల్లాపురం, ఆకుపాముల గ్రామాలకు చెందిన వారిని అదుపులోకి తీసుకుని, వారి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.