సకాలంలో వైద్యంతో నిలిచిన నిండు ప్రాణాలు

తుఫాన్ లో తడిసి గర్భ వాతముతో పడిపోయిన నిండు చూలు గొర్రెను పరీక్షించిన కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ నిండు ప్రాణాలను కాపాడాడు. అల్ట్రా వైలెట్ రెడ్ లాంప్ తో గొర్రె శరీరాన్ని వేడిపరిచి, అవసరమైన గ్లూకోజ్, క్యాల్షియం రక్తంలోకి ఎక్కించి సపోర్టివ్ చికిత్స అందించడంతో ప్రాణాపాయము నుండి విలువైన గొర్రె ప్రాణాలు నిలిచాయి. గొర్రె యజమాని సరైన వైద్యం అందించి కాపాడినందుకు డాక్టర్ పెంటయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕