సూర్యాపేటలోని వైట్ హౌస్ లో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. కళాశాల సమస్యలను వివరించి, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.