రైతుల సంక్షేమం, మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత

రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా, సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్‌ను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కార్యదర్శి ఎం. డి. ఫసియొద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, సూర్యాపేట మార్కెట్ యార్డు అభివృద్ధి, రైతులకు మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాల విస్తరణ, మార్కెట్ సేవల నాణ్యత పెంపు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చించారు. రైతుల సంక్షేమం, మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఫసియొద్దీన్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్