సూర్యాపేట జిల్లాలో విస్తారంగా వర్షాలు

సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, చింతలపాలెం, మఠంపల్లి మరియు మేళ్లచెరువు మండలాల్లో బుధవారం  తెల్లవారుజాము నుంచే ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఈ అకాల వర్షం కారణంగా రహదారులు తడిసిముద్దవ్వడంతో జనజీవనం స్తంభించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా వర్షం కారణంగా వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕