సూర్యాపేటలో భారీ వర్షాలు..పాఠశాలలకు సెలవు

భారీ వర్షాలు, భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕