మిత్ర మండలి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

సూర్యాపేటలో పూర్వ విద్యార్థి మిత్ర మండలి ఆధ్వర్యంలో హోళీ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రంగులు చల్లుకున్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, యుద్ధం వద్దు శాంతే ముద్దు అని నినాదాలు చేశారు. గౌరవాధ్యక్షులు డా. ఊర రామ్మూర్తి యాదవ్ కులమతాలకు అతీతంగా శాంతి నెలకొలపాలని కోరారు. ప్రధాన కార్యదర్శి బయ్యా మల్లికార్జున్ ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్