భారాసలో చేరికలు

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీ అయిన భారాసను ఆదరిస్తారని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని భారాస కార్యాలయంలో ఆయన సమక్షంలో భారాసలో చేరారు. వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భారాస జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి రాంచందర్నాయక్, వై. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్