సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష మంగళవారం నాటికి 47వ రోజుకు చేరింది. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చలమల్ల నరసింహ లు ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. బుల్లెట్ ట్రైన్ సాధనే ధ్యేయంగా ఉద్యమాలను జాతీయ రహదారి 65 సమాంతరంగా ఉదృతం చేసే దిశగా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.