పూడ్చకుంటే ప్రమాదమే!

సూర్యాపేటలోని 25వ వార్డు నాగులమ్మ గుడి సమీపంలో సుమారు 50 ఏళ్ల పాత బావిని పూడ్చివేయాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. శనివారం బావి వద్ద మహిళలు నిరసన తెలిపారు. బావిలో పాములు సంచరిస్తుండటంతో పాటు దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ప్రమాదం జరగకముందే బావిని పూర్తిగా పూడ్చివేయాలని కోరారు. కార్యక్రమంలో మడ్డి వెంకన్న, స్వప్న, కల్పన, చిలుకమ్మ, నాగమణి, పూర్ణిమ, ఉష, రేణుక, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕