మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. మనుషుల ఎత్తులు, పొడుగుల గురించి మాట్లాడటం సంస్కారం లేని వ్యక్తుల లక్షణమని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేకుండా ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ అంశాలపై చర్చ జరగాలని జగదీశ్ రెడ్డి సోమవారం సూచించారు. వ్యక్తుల శారీరక లక్షణాలపై వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.