జాజిరెడ్డిగూడెం: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గోపాల రెడ్డి నగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో, కారులో ప్రయాణిస్తున్న కొమ్మల గ్రామానికి చెందిన భయ్యా మధు (22) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తండ్రి పేరు అవులయ్యగా గుర్తించారు. ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్