సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామ పరిధిలోని ఓ తండాకు చెందిన జేఎన్టీయూహెచ్ మూడో సంవత్సరం విద్యార్థి మహేశ్, శుక్రవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజులుగా కాలేజీకి వెళ్లకుండా గదికే పరిమితమైన మహేశ్, తోటి విద్యార్థులు క్లాసులకు వెళ్ళిన తర్వాత ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తోటి విద్యార్థులు గమనించి యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, ఆసుపత్రిలో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి గదిలో సూసైడ్ నోట్ దొరికినట్లు తెలిసినా, అందులో ఏముందో, ఆత్మహత్యకు కారణమేంటో తెలియరాలేదు. ఈ మృతి ప్రస్తుతం మిస్టరీగా మారింది.