సూర్యాపేట జిల్లా, సూర్యాపేట నియోజకవర్గంలోని వట్టి ఖమ్మంపహాడ్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, యువత గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. మహిళలు, బాలికలు అత్యవసర పరిస్థితుల్లో డయల్-100, షీటీమ్‌ను ఆశ్రయించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధారవత్ వీరన్న నాయక్, వేములపల్లి వాసుదేవరావు, గోగుల ఈదయ్య పాల్గొన్నారు.