కాంగ్రెస్ పార్టీ నుండి మాదిగలకు ఒక రాజ్యసభస్థానం కేటాయించాలి

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుండి మాదిగలకు ఒక రాజ్యసభ స్థానం కేటాయించాలని ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఏపూరి రాజు మాదిగ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మాదిగల జనాభా అధికంగా ఉన్నందున ఈ అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై హామీ నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్