సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్‌ను ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, రాజేష్ తల్లి లలితమ్మతో కలిసి కలిసి వినతిపత్రం అందజేశారు. కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతికి కారణమైన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.