సూర్యాపేట జిల్లాలో 29 కేసుల్లో పట్టుబడిన 227.18 కేజీల గంజాయిని కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు దహనం చేశారు. యాదాద్రి జిల్లా తుక్కాపుర్‌లోని రోమా ఇండస్ట్రీస్‌లో పర్యావరణానికి హాని కలగకుండా ఈ డ్రగ్స్‌ను నిర్వీర్యం చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. దీని విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ సమాచారాన్ని డయల్ 100, 112 నంబర్లకు అందించాలని ప్రజలను ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.