సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండేటి బిక్షం రెడ్డి తండ్రి స్వర్గీయ కొండేటి నర్సిరెడ్డి దశదిన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించి, నర్సిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందర్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, అయూబ్ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సర్పంచ్ అనుములపురి నాగయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు సద్దల నగేష్, జిల్లా, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.