సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా గుడిబండ సహకార సంఘ గోదాము వద్ద NDCC కోదాడ బ్రాంచ్ మేనేజర్ సోమవారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కోదాడ PACs చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ బుడిగం నరేష్ కుమార్, డైరెక్టర్లు ప్రభాకర్ రావు, సీఈవో మంద వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమాటి నాగిరెడ్డి, పులి వెంకటేశ్వర్లు, కుక్కడపు నాగరాజు, మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.