అవినీతి రహిత సమాజమే పవన్ కళ్యాణ్ లక్ష్యం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు ఏవి రావు మాట్లాడుతూ అవినీతి, కుంభకోణాలు లేని సమాజ నిర్మాణమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని తెలిపారు. ప్రజల కోసం ఆయన చేస్తున్న పోరాటానికి అందరూ అండగా నిలవాలని కోరారు. జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్