సూర్యాపేట మండలంలోని సోలిపేట గ్రామంలో మేకల జయరాములు(50) హత్యకు గురైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఇటీవల జిల్లాలో వరుస హత్యలు జరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.