సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ అబ్దుల్ రషీద్ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు తంగేళ్ల జితేందర్ రెడ్డి, సూర్యాపేట పట్టణ పిఆర్టియు అధ్యక్ష కార్యదర్శులు సుధీర్ రెడ్డి, శ్రీరామ్ వెంకట్, రాష్ట్ర నాయకులు శివశంకర్, ఎల్లయ్యలు సంతాపం వ్యక్తం చేశారు. క్రీడా రంగానికి రషీద్ మృతి తీరని లోటు అని వారు పేర్కొన్నారు.