రహదారులపై ప్రమాదాలకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని 108 లేదా 100కు ఫోన్ చేసి వారి ప్రాణాలను కాపాడితే, రఘువీర్ యోజన కింద అవార్డుతో పాటు రూ.25 వేల రివార్డు పొందవచ్చని జిల్లా ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. గతంలో ప్రమాదాల్లో గాయపడిన వారిని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రాణాలు కాపాడిన వారిని వీరులుగా గుర్తిస్తుందని ఆయన తెలిపారు.