ఉపాధ్యాయుడు చెరుకు శ్రీనుకు నివాళి: రాంరెడ్డి, నర్సయ్య సంతాపం

సూర్యాపేట పట్టణంలోని 47వ వార్డు నల్లాల బావి వద్ద ఇటీవల మృతి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, PRTU నాయకులు కీ.శే. చెరుకు శ్రీను చిత్రపటానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, PRTU జిల్లా అధ్యక్షుడు తంగేళ్ల జితేందర్ రెడ్డి, పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి చింతమళ్ల రమేష్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్