ఏడు సంవత్సరాలుగా అదే రెమ్యునరేషన్... ఉపాధ్యాయుల ధర్నా

సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర పిలుపు మేరకు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో SSC స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. గత ఏడు సంవత్సరాలుగా రెమ్యునరేషన్ పెంచలేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్‌తో సమానంగా పారితోషికం పెంచాలని, స్పాట్ ముగిసిన వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి జవాబు పత్రానికి ఇచ్చే నామమాత్రపు రెమ్యునరేషన్, స్పెషల్ అసిస్టెంట్ల వేతనం రెట్టింపు చేయాలని కోరారు. అనంతరం డిప్యూటీ క్యాంప్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్