సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఏఐసిసి ఇంఛార్జి సెక్రటరీ విశ్వనాథన్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపాలిటీ ఎన్నికల సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించారు.